Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు సోమవారం రాత్రి ఫ్లడ్ లైట్లను మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 1,50 లక్షల రూపాయల తో నిర్మించిన లైట్లు ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు తొగరు సదానందం, అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వెన్నంపల్లి కిషన్, మక్కాపల్లి కుమారస్వామి, మారేపల్లి సుశీల, కేసిరెడ్డి లావణ్య, ముక్క రమేష్, ఎండి ఇమ్రాన్, కమిషనర్ సర్వాది సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ సాంబరాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, జవాన్ ప్రతాపరాజు తదితరులు పాల్గొన్నారు.







