
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో మరియు ఇటీవల జరిగిన గణపతి నిమర్జన ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు, పువ్వుల దండలు, కొబ్బరి చిప్పలు మరియు ఇతర చెత్తను తొలగించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మాల మూత్ర విసర్జన చేసినట్లయితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చెత్తాచెదారం తొలగించే కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.







