
–సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోతిరెడ్డిపేట గ్రామానికి సంభందించి సమస్యలు ఉన్నాయని తన దృష్టికి వచ్చాయని, సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హుజురాబాద్ పట్టణంతోపాటు పలు గ్రామాల్లో ఆయన వివిధ శుభకార్యాలకు, పరామర్షలకు వెళ్లారు. పోతిరెడ్డిపేట గ్రామానికి వెళ్లిన ప్రణవ్ అక్కడి గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామములోని వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులు ప్రణవ్ ను కలిశారు. గ్రామంలోని సమస్యలను ప్రణవ్ కు వివరిస్తూ ప్రతీచోటుకి ఆయన్ని తీసుకెళ్ళారు.గ్రామం నుండి కనపర్తి వరకు తారు రోడ్డు నిర్మించాలని,ప్రమాదకరంగా ఉన్న బావికి ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. గ్రామములో అతి పురాతనమైన శివాలయం పుననిర్మాణం చేస్తున్న సందర్భంగా ఆలయానికి సహాయం చేయవలసిందిగా వారు కోరారు, కోరిన వెంటనే తన వంతు సహాయం చేస్తానని చెప్పారు. ఎస్సీ కాలనీలో రోడ్డు సరిగా లేవని వానాకాలం సమయంలో ఇబ్బందులు పడుతున్నామని కాలనీకు సీసీ రోడ్ మంజూరు చేయాలని కోరారు. అనంతరం గ్రామములో టీడీపీ సీనియర్ నాయకుడు పుల్లా చారి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.







*పత్రికా ప్రకటనలు*






