
–బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది..
–భారీ ఎత్తున నూతన సభ్యత్వాలు జరుగుతున్నాయి.. ప్రజలనుండి విశేషణ స్పందన ఉంది..
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ సెప్టెంబర్ 22: హుజురాబాద్ పట్టణంలోని 46, 48వ పోలింగ్ బూత్ లలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ బూత్ లలో చేపట్టిన నూతన బిజెపి సభ్యత్వ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్దేశించిందని, జాతీయ పార్టీ పిలుపు మేరకు హుజురాబాద్ పట్టణంలో తన పోలింగ్ బూత్ పరిధిలో మెంబర్షిప్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందన్నారు. పోలింగ్ బూత్ కార్యకర్త నుండి మొదలుకొని జాతీయ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొని, వారి పరిధిలోని పోలింగ్ బూత్ లలో నూతన సభ్యత్వాలు చేపడుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బిజెపి మెంబర్షిప్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతుందన్నారు. భారీ ఎత్తున నూతన సభ్యత్వాలు జరుగుతున్నాయని, రైతులు, మహిళలు, యువకుల, అన్ని వర్గాల ప్రజల నుండి సభ్యత్వ నమోదు కోసం విశేష స్పందన లభిస్తుందన్నారు. సభ్యత్వ నమోదు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల నూతన సభ్యత్వాలు వచ్చాయన్నారు. పార్టీ నిర్దేశించిన 10 కోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవుతుందనే ఆశాభావం ఉందని, జిల్లాలో కూడా ఆశించిన మేరకు నూతన సభ్యత్వాలను చేపట్టి, రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి తగిన కృషి చేస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ కన్వినర్ మాడ గౌతమ్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ సెక్రటరీ నిర్మల, 46వ బూత్ అధ్యక్షులు గుడిపాటి కొండల్ రెడ్డి, సభ్యత్వ నమోదు కో కన్వినర్ లు రాజశేఖర్, యాంశాని శశిధర్, సీనియర్ నాయకులు రమేష్, సమ్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








