
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని గ్రామపంచాయతీలలో మంచినీటి సహాయకులుగా విధులు నిర్వహించే వారికి శుక్రవారం హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయావరణంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజున కరెంటు మోటార్ సింగల్ మరియు త్రి ఫేస్ పానాల్ బోర్డు నిర్వహణ మరియు మరమ్మాత్తులు చేయించడం గూర్చి శిక్షణ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నుండి వచ్చిన ఎలక్ట్రికల్ మాస్టర్ ట్రేనర్ రాజకుమార్ ప్రయోగపూర్వకంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ డిఈ టి బాలరాజు, మిషన్ భగీరథ ఇంట్రా డిఈ ఎండి కాజా వశీయుద్దీన్, ఏఈ మౌనిక ఎంపీడీఓ సునీత, ఎంపీవో సతీషకుమార్, ల్యాబ్ సిబ్బంది సురేష్, కోటిలింగం, వేణుగోపాల్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.








