
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి కుల బాంధవుడు కీర్తిశేషులు కోట లక్ష్మణ్ అకాల మరణానికి గురి కావడంతో ఆయన కుటుంబానికి హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం తరపున 50 కిలోల బియ్యం మరియు వంటనూనె ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ పట్టణ పద్మశాలి సంఘం నాయకుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్, చేనేత ఐక్యవేదిక డివిజన్ అధ్యక్షుడు కుడికాల సాయి, నాయకులు మంద బిక్షపతి, ఇప్పకాయల సాగర్, మరియు ధర్మరాజు పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఇప్పలపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి సాయి, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
