
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ హక్కుల సాధన కోసం, కుల గణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం వాటా అమలు చేయాలని ఆమరణ దీక్ష చేసిన బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను హుజురాబాద్ మండలం పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించారు. విరోచిత పోరాటంతో బీసీ ఉద్యమాన్ని తట్టి లేపిన సంజయ్ కుమార్ ని ప్రశంసించారు. గత 9 సంవత్సరాలుగా బీసీ ఉద్యమమే లోకంగా అనేక పోరాటాలు చేస్తున్న వారి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సంజయ్ ఆరోగ్యం బాగోగులు తెలుసుకోవడం జరిగిందనీ, ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అడిచర్ల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, చేనేత ఐక్యవేదిక హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు కుడికాల సాయి, హుస్నాబాద్ కాంసెన్సీ అధ్యక్షులు పోతరాజు సంపత్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం హుజురాబాద్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
