
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో నీ పలు ప్రభుత్వ కార్యాలయాలలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజలు అధికారులు నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గందె రాధిక, కమిషనర్ ఎస్ సమ్మయ్య, రెవెన్యూ కార్యాలయంలో పలువురు అధికారులు జాతిపిత గాంధీ చిత్రపతానికి పూలమాల నివాళులు అర్పించారు. కేసీ క్యాంపులో ని గాంధీ విగ్రహానికి చైర్ పర్సన్ రాధిక, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, ఇంచార్జి మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి సాంబరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ MD. రషీద్, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ M కిషన్ రావు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.







