
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి,(జమ్మికుంట) హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని ఏడవ వార్డు దుర్గాకాలనీ లో పాత మణికంఠ రైస్ మిల్లు ఎదురు గల్లీలో గత 30 సంవత్సరాల నుండి పాత మేజర్ గ్రామపంచాయతీ ప్రస్తుతం మున్సిపల్ ఆ గల్లీలో 12 పిట్ల రోడ్డు ఉంది. మేజర్ గ్రామపంచాయతీ చట్టం ప్రకారము రెండు వైపులా ఐదు ఫీట్లు వదిలిపెట్టి గ్రామపంచాయతీ గాని మున్సిపల్ కానీ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది కానీ మున్సిపల్ అధికారులు చట్టానికి విరుద్ధంగా పర్మిషన్ ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుందని అలాగే అదే కాలనీకి చెందిన గడ్డం పెద్దులు తన పాత ఇల్లు నిర్మాణాన్ని కూలగొట్టి పాత కట్టడం కంటే మూడున్నర ఫీట్లు ఎక్కువ గ్రామపంచాయతీ డ్రైనేజీని ఆక్రమించుకొని నూతన నిర్మాణం ఇంటికి కోసం పర్మిషన్ తీసుకోవడం జరిగినది కానీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యం వలన రోడ్డును ఆక్రమించిన వ్యక్తి రాత్రికి రాత్రే ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుందని కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్థానిక కౌన్సిలర్ ను సంప్రదించిన ఎలాంటి స్పందన రాలేదని కాలనీవాసులు అన్నారు. సదరు వ్యక్తికి కౌన్సిలర్ కూడా వత్తాసు పలుకుతున్నారని కాలనీవాసులు అన్నారు. ఇట్టి విషయాన్ని మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చిన స్పందనలేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన ఇంటి యజమాని మారకపోగా ఎవరొచ్చినా వాళ్లను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ బూతులు తిడుతూ.. నా ఇంటి మీదికి వస్తే నరుకుతా.. కొడతా అని బెరింపులకు గురి చేస్తున్నాడని కాలనీవాసులు తెలిపారు. ఇతను కొన్ని రోజుల క్రితం ఆ కాలనీవాసులు రోడ్డులో గోడ పెడుతున్నావని ప్రశ్నించగా దాడికి పాల్పడడం జరిగిందనీ కాలనీ వాసులు తెలిపారు. ఎవరు ముందుకు వచ్చి మాట్లాడిన వారిని దుర్భాషలాడుతూ నానా బూతులు తిట్టడం జరుగుతుందన్నారు. స్థానిక కాలనీ వాసి అయిన వేణు మాట్లాడుతూ ఇదే కాలనిలో మేము గత 27 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకొని ఉంటున్నామని అప్పటినుండి ఇప్పటివరకు మా కాలనీకి డ్రైనేజీ కానీ, పైప్ లైన్ కానీ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గ్రామపంచాయతీ నుండి వార్డు మెంబర్లు మారిన 2011 నుండి మున్సిపల్ గా మారిన కౌన్సిలర్లు గాని మున్సిపల్ అధికారులు గానీ స్పందించడం లేదని ఆరోపించారు. ఇంటి పన్నులు, నల్ల పన్నులు మాత్రం మున్సిపల్ లెక్క ప్రకారమే తీసుకుంటున్నారు కానీ మా డ్రైనేజీ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండడం జమ్మికుంట పట్టణంలోనే ఎక్కడ లేదని ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు డ్రైనేజీలు లేకుండా కొత్తగా నిర్మిస్తున్న గృహాలను తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు నిర్మాణాన్ని ఆపిన మున్సిపల్ అధికారులకు సెలవు ఉన్న రోజులలో సదరు వ్యక్తి చట్ట విరుద్ధంగా రాత్రికి రాత్రి నిర్మాణం చేయడం జరుగుతున్నదని వారన్నారు. పైన కరెంటు లైన్ కూడా పిల్లరుకు ఆనుకొని ఉన్న లైనును కరెంటు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అట్టి వైర్లకు పైపులు తొడిగించి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, కరెంటు అధికారులు స్పందించి కరెంటు లైన్ కింద ఉన్న పిల్లర్లను తొలగించాలని వారు కోరారు. ఎన్నోసార్లు స్థానిక కౌన్సిలర్ కు మొరపెట్టుకున్న స్పందించలేదని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా ప్రజల విజ్ఞప్తిని పట్టించుకోని అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కాలనీవాసులు కోరుతున్నారు.







