Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్థరాత్రి నిద్రిస్తున్న తమ్మున్ని అతి దారుణముగా అన్న హత్య చేయడం సంచలనం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ చంద్రు (24) అనే యువకుడు కొలుపు కొలిచే (దుబ్బుల పని) పని చేస్తూ జీవించేవాడు. అతని అన్న కుందేళ్ళ కుమారస్వామి తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అన్నకు తమ్ముడు పై లేనిపోని అనుమానాలు కలిగి అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇనుపరాడ్ తో తమ్ముడు చంద్రుని అన్న కుమారస్వామి తలపై కోట్టి హత్య చేసినట్లు తెలిపారు. చంద్రు హత్యకు ఆస్తి తగాదాలే కారణమని కొందరు భావిస్తుండగా, చంద్రు అక్రమ సంబంధమే కారణమని మరికొందరు భావిస్తున్నారు. ఏదిఏమైనా పోలీసులు సమగ్ర విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






