
–దుర్గా దేవి ఆశీస్సులు
ప్రతి ఒక్కరీపై ఉండాలి..
–దసరాను ప్రతి ఇంటా
ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి..
–ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి సాధించిన విజయానికి, దుష్టశక్తులపై దైవశక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునేదే దసరా పండుగ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం దసరా పండుగ, విజయదశమి పురస్కరించుకొని ప్రజలందరికీ వెలిచాల రాజేందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడు ఎంత దుర్మార్గమైన, ఎంత శక్తిమంతమైనదైనా మంచితనమే అంతిమంగా విజయం సాధిస్తుందని తెలిపారు.
ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో విలసిల్లాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని పేర్కొన్నారు. దుర్గాదేవి దీవెనలు ఆశీస్సులు ప్రతి ఒక్కరీపై ఉండాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు.

తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటారని వివరించారు. ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. జమ్మి ఆకు అందించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభ సూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గాదేవి కృపాకటాక్షాలు ప్రజలందరీపై ఉండాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. ప్రతి ఇంటింటా ప్రజలు విజయదశమిని ఆనందోత్సా హాల మధ్య జరుపుకోవాలని సూచించారు.
*పత్రికా ప్రకటనలు*






