
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అంబేద్కర్ కూడలి వద్ద కరీంనగర్ జీవగడ్డ సాయంకాల దినపత్రిక ఎడిటర్ భాగ్యనగర్ విజయ్ కుమార్ పదవ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విజయ్ కుమార్ మిత్ర బృందం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రికా ద్వారా ప్రగతి కోసం సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మౌలిక సదుపాయాల కోసం అనేక రకాల పోరాటాలు చేసి ఉద్యమాలు నిర్వహించి ఎనలేని సేవలు చేశాడని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. విజయ్ కుమార్ కరీంనగర్ కేంద్రంగా యువ సాహితీ కరీంనగర్ సాహితి మిత్ర మండలి ఉద్యమ సాహితి లాంటి సాహిత్య సంస్థల వ్యవస్థాపకులుగా పలు పుస్తకాలు ప్రచురణకర్తగా విద్యుల్లత జీవగడ్డ పత్రికల సంపాదకులుగా పనిచేసి గుర్తింపు పొందారన్నారు. భాగ్యనగర్ విజయ్ కుమార్ గురించి ఈ సందర్భంగా స్మరించుకోవడమే కాదు ఆయన ఆశయ సాధనలో మనం నిర్వహిస్తున్న భూమికను గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, బిఆర్ఎస్ నాయకులు చందా గాంధీ, పివి జిల్లా సాధన సమితి అధ్యక్షులు భీమోజు సదానందం, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజ్యం, పులి జగన్నాథం, వేల్పుల ప్రభాకర్, ద్రావిడ మహాసభ కన్వీనర్ రామ్ రాజేశ్వర్, శనిగరపు భాస్కర్, హుజురాబాద్ పాత్రికేయ మిత్రులు పోతరాజు సంపత్, తలారి విష్ణు, కుడికాల సాయి, బీసీ నాయకులు ఆళ్ళ కేశవులు, కొల్లూరు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

