
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో మొన్న గర్భిణీల ప్రసవ వేదన విషయం మరవకముందే.. మళ్లీ నేడు ఓ ఘోరం గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని మహిళ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉండే మహిళల మరుగుదొడ్ల వద్ద అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశువును లాటరీన్ లో వదిలేసి వెళ్లడం కలకలం సృష్టించింది. సుమారు 9:30 ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ లాటరీన్ లోపలికి వెళ్లి అక్కడే అబార్షన్ చేసి తీసిన శిశువును వదిలేసి వెళ్లడం బాత్రూం వెళ్లిన మహిళల కంటపడింది. దీంతో ఈ విషయం డ్యూటీ వైద్యుడు డాక్టర్ రమేష్ ద్రుష్టికి తీసుకురాగా వారు పరిశీలించి పోలీసులకు, వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ మృత శిశువు ఏక్కడిదోనని.. మా ఆస్పత్రిలో ఏలాంటి డెలివరీలు కానీ అబార్షన్ కానీ చేయలేదని.. వేరే ఎక్కడినుండో తీసుకువచ్చి గుర్తు తెలియని వారు ఇక్కడ వదిలేసి ఉంటారని డ్యూటీ వైద్యుడు డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి సిసి ఫుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అబార్షన్ చేసి బయటకు తీసిన మృత ఆడ శిశువును బాత్రూంలో వదిలేసి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో అబార్షన్ జరిగితే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి బాత్రూంలో వదిలేసి వెళ్లవలసిన అవసరం ఎవరికీ ఉంటుంది? లేదా ఇదే ఆసుపత్రిలో అబార్షన్ చేసి ఉంటే శిశువు మృతదేహాన్ని తీసుకువచ్చి బాత్రూంలో వదిలేయవలసిన అవసరం ఎందుకు ఉంటుంది. ప్రతిదీ కూడా దావకానలోని సీసీ కెమెరాలల్లో కనిపిస్తుందని, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు సమగ్ర విచారణ జరిపితే త్వరలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








