Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన ఓ మైనర్ బాలిక (16) నిన్నటి నుండి కనిపించకుండా పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు. సాయిలు- కోమల అనే దంపతుల కుమార్తె నిన్న సాయంత్రం కిరాణం షాప్ కు వెళ్లి వస్తానని ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. అయితే ఆ యువతిని సమీపంలో నివసించే శేఖర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లినట్లు స్థానికులు ఆరోపించారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సదరు యువతినీ శేఖర్ అనే వ్యక్తి భార్య పిల్లలు ఉండగా మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. నేటి ఉదయం వరకు కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అమే తల్లిదండ్రులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో శేఖర్ పై ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు శేఖర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన యువతి ఆచూకీ తెలిసినట్లయితే ఆమె తల్లిదండ్రులకు 9618473587 నెంబర్ కి, హుజురాబాద్ సిఐ కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.






