Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో దివ్యంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో 40మంది దివ్యంగులకి ఉచిత బస్ పాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ దివ్యంగులు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ లను వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కారోబార్ ఎం సురేందర్ మరియు ఆర్టీసీ సిబ్బంది జి.ఏస్ రెడ్డి, ఎల్లయ్య, సాయిచరణ్, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






