Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన చిలకమరి శ్రీనివాస్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలిల ఐక్యత కోసం పని చేస్తున్న, అదేవిధంగా ప్రాథమిక చికిత్స నిపుణుడుగా పని చేస్తున్న శ్రీనివాస్ భవిష్యత్లో బీసీ ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలని ఈ నియమకం చేపట్టినట్లు సంజయ్ కుమార్ తెలిపారు. గ్రామ గ్రామాన బీసీలను సంఘటితం చేస్తూ పోరాటం చేయాలని ఆయన కోరారు. కాగా శ్రీనివాస్ నియామకం పట్ల పలువురు మిత్రులు, పద్మశాలి సేవా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

తనపై ఎంతో నమ్మకంతో ఈ భాద్యతలు ఇచ్చిన సంజయ్ కుమార్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.





