మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అసలే రెక్కాడితే డొక్కాడని కుటుంబం అతనిది. ఆ కుటుంబానికి పెద్దది ఎక్కువైన వ్యక్తి ఒక్కసారిగా ఆచేతన స్థితిలో పడి ఉండడంతో కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన కొలిపాక సమ్మయ్య కుటుంబము దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది. వివరాలలోకి వెళ్తే… పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన కొలిపాక సమ్మయ్య శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ప్రశాంత్, అజయ్. సమ్మయ్య మొలంగూరు గ్రామంలోని ఒక ప్రైవేట్ సీడ్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. రోజు వలె పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో అనుకోకుండా ఉదయం తన భార్య లేపే క్రమంలో స్పందన లేకపోయేసరికి హుటాహుటిన హన్మకొండలోని ఎన్ఎస్ఆర్ ఆసుపత్రికి తీసుకువెళ్లిన క్రమంలో డాక్టర్లు పరీక్షించి తనకి మెదడులో రక్తం గడ్డ కట్టిందని.. ఆపరేషన్ కి చాలా డబ్బులు అవసరం అవుతాయని చెప్పారు. ఈ క్రమంలో దాదాపు ఇప్పటికీ అక్షరాల తొమ్మిది లక్షలు ఖర్చు అయ్యాయని, ఇంకా మా దగ్గర స్తోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నామని, దయతలచి మా నాన్నని బ్రతికించగలరని చేతులు జోడించి వేడుకుంటున్నామని అతని కుమారులు భార్య వేడుకుంటున్నారు. ఎవరైనా పెద్ద మనసుతో దాతలు ఫోన్ పే ద్వారాగాని, గూగుల్ పే ద్వారా గాని ఈ క్రింది నెబర్లకు డబ్బులు పంపగలరని వేడుకున్నారు. కొలిపాక సమ్మయ్య 9866563952, కొలిపాక ప్రశాంత్ 970 4550 975,
కొలిపాక అజయ్ 9000146828 కి డబ్బులు పంపి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.