
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం జూపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రాజపల్లి గ్రామం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జూపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శుక్రవారం ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి సకాలంలో కొనుగోలు చేయడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయించిన విధంగా దాన్ని మారపెట్టి నిర్ణీత తేమ ప్రకారం తీసుకురావాలని అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సహకార సంఘం ఉపాధ్యక్షురాలు శనిగరం రజిత, AEO మద్ది నరేష్, Ceo ఏడవెల్లి రాజిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.






