
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏ లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) అధ్యక్షులు పవన్ కుమార్ అన్నారు. సోమవారం హుజురాబాద్ తాసిల్దార్ కనుకయ్యకు పెండింగ్ డిఏల విడుదలపై వినతి పత్రం అందజేశారు. కుబేర్ లో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు పిఆర్సి కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాజేందర్, రాంప్రసాద్, అరుణ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
