–హుస్నాబాద్ నాయకులపై చిన్నచూపు.. కరీంనగర్ నేతలకు ప్రాధాన్యత ఎలా..?
–హుస్నాబాద్ లో మాతా శిశు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.. గౌరవెల్లి కాలువల నిర్మాణంపై దృష్టి సారించాలి
–గౌరవెల్లి ముంపు రైతులకు ఎకరాకు 30లక్షల ఇస్తానన్న హామీ ఏమైంది..
–పక్క మండలాల రైతులకు ఓన్యాయం.. చిగురుమామిడి మండల రైతులకు 11లక్షలు ఎలా?
–హుస్నాబాద్ కొత్తపల్లి రహదారిని మూల మలుపులు లేకుండా సరిచేయండి
–ధాన్యం కొనుగోలు మందకుండుగా కొనసాగడం దురదృష్టకరం రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, చిగురుమామిడి,అక్టోబర్ 28: మంత్రి పొన్నం గెలిచింది.. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచా లేక కరీంనగర్ నుండా అనేది అర్థం కాక ప్రజలు అపోహ పడుతున్నారని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల నుంచి, వారి కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా ఒక నానుడిలా మాట వినిపిస్తుందని, కరీంనగర్ లో గెలిచినట్లు మంత్రి అపోహ పడుతున్నారని, హుస్నాబాద్ లో గెలిచినట్లు కనిపించడం లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎద్దేవ చేశారు. సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడారు. కరీంనగర్ వాళ్లను హుస్నాబాద్ కు పదే పదే రప్పించి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కరీంనగర్లో గెలిచిన ఎమ్మెల్యేలా మాట్లాడవద్దని, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన పొన్నం హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పాటుపడాలని హితువు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా ప్రయోజనాల కోసం ఇంకా ప్రారంభించాల్సినటువంటి నాలుగైదు కార్యక్రమాలు ఉండగా వాటిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. హుస్నాబాద్ లో మాతా శిశు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా వరి తగతిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈప్రాంత వాసులకు వెసులుబాటు కల్పించేలా మాతా శిశు కేంద్రం చాలా కీలకమైనదని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్న ప్రభాకర్, మంత్రి కావడంతో మొదటిసారి నియోజకవర్గానికి మంత్రి పదవి వరించడంతో ఎంతో బలంగా హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆశించినప్పటికీ, గడచిన 10నెలల కాలంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంత వరప్రదాయిని అయిన గౌరవెల్లి ప్రాజెక్టు కాలువను నిర్మాణం కోసం సర్వే చేయడం జరిగిందని గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని, ఇందులో భూమిని కోల్పోతున్న రైతాంగానికి ఎకరాకు కేవలం 11లక్షల రూపాయలు మాత్రమే ఇస్తారని ప్రచారం జరుగుతోందని, ఆనాడు గౌరవెల్లి ప్రాజెక్టు రైతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రస్తుత మంత్రి పొన్న ప్రభాకర్ ఎకరాకు 30లక్షలు ఇప్పిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ హామీ అమలు కాకపోతుండడంతో ఆనాడు ఓట్ల కోసమా లేక మెప్పు కోసమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముంపు గ్రామాల రైతాంగానికి నాడు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం లేదని 18 ఏళ్లు నిండిన యువతులకు, యువకులకు ఇస్తామన్న పరిహారం హామీ ఏమైందని, ఇతరత్రా సదుపాయాల కోసం విడుదల చేయిస్తామన్న నిధుల హామీ ఎందుకు విస్మరించినట్లు స్పష్టం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరారు. పక్క మండలాల్లో ఏవిధంగానైతే ఎకరాకు 30లక్షల రూపాయలు ఇప్పిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారని, చిగురు మామిడి మండల రైతాంగానికి సైతం ఎకరాకు 30 లక్షల రూపాయలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. చిగురు మామిడి మండల రైతులు ఏం పాపం చేశారని పరిహారం ఇప్పించడంలో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ద్వారా ఇంతే వస్తుందని ప్రజలకు స్పష్టత నివ్వాలని చెప్పారు ఓడ దాటేదాకా ఓడ మల్లన్న ఓడ దాటాక బోడి మల్లన్న అన్న తిరుగా పొన్నం తీరు మారిందని ఎమ్మెల్యేగా గెలిచే వరకు ఓ మాట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యాక మరో మాట మాట్లాడడం సరికాదని విమర్శించారు. గౌరవెల్లి వరద కాలువ సర్వే పూర్తి చేయించి పనులు త్వరగా పూర్తి చేయించాలని కోరారు. గౌరవెల్లి లో ఎమ్మెల్యే కాకముందు పలుమార్లు పర్యటించిన మంత్రి పున్నం ఆనాడు గుడాటిపల్లి సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆనాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించిన మంత్రి పలుమార్లు ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యేట్లు ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం నాడు ప్రోత్సాహించి కేసు వేయించినటువంటి రైతులకు ఆనాడి ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేక పోతున్నారని ప్రశ్నించారు. సింగరాయ ప్రాజెక్టుతో పాటు అనేక చిన్నపాటి ప్రాజెక్టులకు కాలువల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిండితేనే హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతుల మోములో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులు మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నిర్మించే నాలుగు వరసల రహదారిలో చాలావరకు మూలమలుపులు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిదిద్దే అవసరం ఎంతైనా ఉందన్నారు. వంకర టింకర మూల మలుపులతో ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతున్న దుస్థితి నెలకొందని ఈ విజ్ఞప్తిని సైతం దృష్టిలో పెట్టుకొని రహదారి నిర్మాణం సాఫీగా జరిగేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వంకర టింకర మూలమలుపులతో ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతున్న దుస్థితి నెలకొందని ఈ విజ్ఞప్తిని సైతం దృష్టిలో పెట్టుకొని రహదారి నిర్మాణం సాఫీగా జరిగేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం ఒక లారీ ధాన్యం సేకరించి మిల్లులకు పంపించిన దాఖలాలు కనిపించడం లేదని, రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పచ్చివడ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మందకొండ గా జరుగుతున్నాయని వేగవంతంగా జరిగే రైతుల విక్రయించిన ధాన్యానికి డబ్బులను త్వరితగతిన అందించేట్లు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిగురుమాడి మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.