
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (బోధన్): బోధన్ విద్యావంతులు, మేధావులకు వేదికగా శాసనమండలిని మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా.. పలు పాఠశాలలో ఉపాధ్యాయ, అధ్యాపకులతో పాటు, బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై మండలిలో తనవంతుగా పోరాటం చేస్తానన్నారు. శాసనమండలిలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు.. గతంలో గెలిచినవారు పట్టించుకోలేదని, నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలోని నిరుద్యోగు లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిలో రాణించేలా కృషి చేస్తా అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. తనను సంపూర్ణ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ తో ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవికి ఇవన్నీ తీస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను నిర్మూలించి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేటు కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంటు, విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలు విడుదల కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు…రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను చెల్లించేలా ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ..317 G.Oతో రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు..ఆ సమస్య ను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు..అదేవిధంగా రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు కృషి చేస్తానన్నారు..నగదు రహిత హెల్త్ స్కీంను అమలు చేసి ఉద్యోగులు పడే ఇబ్బందులు పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అల్ఫోర్స్ పక్షాన ఉచిత యాప్ రూపొందించామని, దీని ద్వారా 3వేల గంటల నిడివి గల నాణ్యమైన బోధన ఉద్యోగార్థులకు అందిస్తామన్నారు. దీనిని నిరుద్యోగులు ఉపయోగించుకుని రాబోవు ఉద్యోగ పరీక్షలలో విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంగా ఉద్యోగ నియామకాలు వేగంగా జరుగుతున్నయని, ఎలాంటి హడావిడి లేకుండా ఉద్యోగాలు చకచకా భర్తీ అవుతున్నాయని, దీని కోసం నిరుద్యోగులను సన్నద్ధం చేయాడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ ద్వారా ఉచితంగా కోచింగ్ అందిస్తున్నామని, నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోవు పట్టభద్రుల ఎన్ని కల బరిలో ఉన్న తనకు అన్ని వర్గాల నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. దీని కోసం కరీంనగర్, ఆదిలాబాద్, నిజమా బాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది పట్టభద్రులను కలిశానన్నారు. మరోవైపు ప్రయివేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్, రీయింబర్స్ మెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను గెలిచాక పై సమస్యలన్నీంటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.




