
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హుజురాబాద్ ఇన్చార్జి సందేశ్ అన్నారు. సోమవారం హుజురాబాద్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన అనంతరం తాసిల్దార్ కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్కాలర్షిప్ లను ప్రభుత్వం విడుదల చేయక పోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కళాశాల సైతం అధికంగా నిధులు పెండింగ్ ఉండడం వల్ల నడపలేక కాలేజీలను బoద్ చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఇంచార్జ్ సుదీర్, నాయకులు లోకేష్, మణిదీప్, రామ్ చరణ్, దినేష్, శ్రీహరి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
