
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్పీ కానిస్టేబుల్స్ వారి హక్కుల కోసం నిరసన తెలిపే క్రమంలో ప్రభుత్వం కొన్ని చోట్ల అరెస్టులు కొంతమంది కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేయడం అత్యంత బాధాకరమని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలో వాసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుల్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్న క్రమంలో ప్రభుత్వం కొంతమంది కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటువేయడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులు వారు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం వారి ఆవేదనగా గుర్తించాలన్నారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఏక్ పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి డిజిపిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాసు కోరారు. శాంతి భద్రతల విభాగంలో భాగమైన స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్స్ కు గతంలో మాదిరిగా ప్రభుత్వం రికార్డ్ పర్మిషన్ కింద సుమారు నాలుగు రోజుల వెసులుబాటు కల్పించడం ద్వారా కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో గడిపే వారని వారి బాగోగులు చూసుకునే అవకాశం ఉండేదని వాసు గుర్తు చేశారు. పాత విధానాన్నే ప్రభుత్వం కొనసాగించి వారికున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న, మారముల్లా కిరణ్, మొలుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.






