Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందిరాగాందీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారతదేశానికి ప్రధానిగా ఇందిరా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా నాయకురాల్లు ఇంకా యువజన కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా నాయకులు, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






