
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
త్వరలో జరగబోయే ఎన్నికల ఓటర్ లిస్టులపై గురువారం హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు తన కార్యాలయంలో రాజకీయాలు పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త ఓటర్ నమోదు 2025 జనవరి వరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 28 వరకు ఓటు అప్లై చేసుకోవాలని, మార్పులు చేర్పులు చేసుకోవాలని అన్నారు. జనవరి 6వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయబడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం లో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, టీడీపీ నాయకులు కామణి రాజేశం తదితరులు పాల్గొన్నారు.







