Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు NSUI మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి స్కూల్ పిల్లలకు సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన సీఎంగా మళ్ళీ ఎన్నికై సేవలందించాలని కోరుకుంటున్నామన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రేవంత్ రెడ్డి వర్ధిల్లాలని ఈ సందర్భంగా సుధీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పైడిపల్లి వెంకటేష్, నాయకులు పైడిపల్లి రాకేష్, జక్కి రవి, కాసర్ల సునీల్, జక్కే రాజేష్, వాసాల రమేష్, వాసాల స్వామి, కిరణ్, అనిల్, ఆకాష్, అక్బర్, సమ్మయ్య, సది, రాకేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






