
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : దళిత బంధుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంలోని రెండో విడుత డబ్బులపై ఫ్రిజింగ్ ఎత్తి వేయకుండా దళిత వర్గాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం వారి కన్నీటికి కారణం అవ్వడం సమంజసమేనా ఆయన ప్రశ్నించారు?. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా దళితులకు కేసీఆర్ ఇచ్చిన దానికంటే రూ.2లక్ష లు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి దళితులను మోసం చేశారని దుయ్యబట్టారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండో విడుత డబ్బులు తప్పక ఇప్పిస్తామని అంటున్నారే తప్పా జరిగింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో విడుత దళిత బంధు డబ్బులు వెంటనే చెల్లించాలని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న, మారముళ్ళ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






