
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హన్మకొండ:
మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, పూలే ఆశయాలను కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నవతరం పూలే అని కొనియాడారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వెనకబడడానికి కులగణన లేకపోవడమే కారణమని పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని పూలే ఆశయ సాధన సమితి (పాస్) ఆధ్వర్యంలో పూలే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ సంగని మల్లేశ్వర్ హాజరై కేక్ కట్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ… కులగణన చేపట్టి బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కులగణన ద్వారా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి బీసీ కులగణన చేపట్టి బీసీల జీవితాలను మార్చేందుకు కంకణం కట్టుకొని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులగణన చేపట్టడం శుభపరిణామం అన్నారు. భవిష్యత్తులో దామాషా ప్రకారం వివిధ పదవులలో అర్హత గల బడుగులకు అవకాశాలు దక్కుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందా మల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి బాబు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ వంగాల సుధాకర్, కేయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ మంద వీరస్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరేగంటి నాగరాజు, కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ శ్రీకాంత్, పాస్ నాయకులు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, బోళ్ళ వీర ప్రతాప్, బేరే కేదారి, విద్యార్థి నాయకులు రాజకుమార్, నగేష్, అళోజి, చరణ్, మనోజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.






