
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణ సంస్థగత ఎన్నికల వర్క్ షాప్ మరియు పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు బూత్ స్థాయి ఆ పై నాయకులు తమ రిఫరల్ కోడ్ పై 100 సభ్యత్యాలు తప్పకుండ నిర్థిష్ట సమయంలో పూర్తి చేయాలనీ కోరారు. బూత్ అధ్యక్షులు నియమించడానికి నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని కోరారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం సంస్థగతంగ పని చేయాలని వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బిజెపి జిల్లా పదాధికారులు, పట్టణ నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







