
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 12: హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామ కారోబారి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ రిపోర్టర్ చిలుకమారి సత్యరాజ్ పద్మశాలి సేవా సంఘం నాయకుడు చిలుకమారి శ్రీనివాసుల తండ్రి చిలుకమారి రాజమౌళి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, మానవ వికాస వేదిక నాయకులు మృతుని కుమారులు చిలుక మారి సత్యరాజ్ పాత్రికేయుడు, మరో కుమారుడు పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా నాయకుడు చిలుకమారి శ్రీనివాసులను పరామర్శించారు. అలాగే రాజమౌళి చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఓడ్నాల రవీందర్, దికొండ లక్ష్మీనారాయణ, సబ్బని రాజేందర్, అలుసా భద్రయ్య, సబ్బని రవీందర్, చిదురాల చక్రపాణి, చేరాల శ్రీనివాస్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిలుకమారి రాజమౌళి మరణం చెందిన విషయం తెలిసి మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవ వికాస వేదిక తెలంగాణ రొంటాల బుచ్చయ్య మరియు బోగం రమేష్ జిల్లా అధ్యక్షులు మానవ వికాస వేదిక కరీంనగర్ జిల్లా సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

