Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈనెల 15న హుజురాబాద్ లో జరిగే ప్రొఫెసర్ బిఎన్ సాయిబాబా సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ప్రజాసంఘాల నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రొఫెసర్ సాయిబాబా సమాజంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశాడని అన్నారు. దేశంలో జరిగే ప్రజా వ్యతిరేక పాలనను సాయిబాబా వ్యతిరేకించారని అలాంటి వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు సంస్మరణ సభకు వీక్షణం సంపాదకులు ఎం వేణుగోపాల్, సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి, పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, పౌరాకుల సంఘం నాయకులు ఎం నారాయణరావు, బిఎన్ సాయిబాబా కుమార్తె మంజీరా, విప్లవ రచయితల సంఘం బాలసాని రాజయ్య, జేఏసీ నాయకులు న్యాయవాది ముక్కెర రాజులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బీమోజు సదానందం, పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, పాక సతీష్, వేల్పుల రత్నం, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






