మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
నవంబర్ 13 ప్రతినిత్యం వంటింటి అవసరాలకు క్రమం తప్పకుండా వంట గ్యాస్ వాడతామని ప్రమాదాల నివారణకు గ్యాస్ వాడకంపై అవగాహన వుండాలని హుజురాబాద్ మహాత్మ జ్యోతిబా పూలే అశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ రాగమణి కోరారు. హుజురాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీ ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో నిర్వహించిన ఇండేన్ భద్రతా శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్యాస్ ప్రమాదాలకు కారణాలు కేవలం కస్టమర్ల అజాగ్రత్తగా వుండడం వల్ల జర్గుతున్నాయని దీని వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసే వార్తలను చూస్తున్నామని పేర్కొన్నారు. సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద పొందే సందర్భంలో ముందస్తు తనిఖీలు (ప్రీ డెలివరీ చెక్స్) చేయాలని సిబ్బందిని కోరాలని, వంట పనులు పూర్తికాగానే సిలిడర్ స్టౌ నాబులు ఆపివేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ ఇండియన్ అయిల్ కార్పొరేషన్ బాలికకు ఎక్కువగా చదువుకునే ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ వాడకంపై పునశ్చరణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
సభాద్యక్షుడు అంబుజా గ్యాస్ ఏజన్సీ మేనేజింగ్ పార్టనర్, తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్ పునశ్చరణ తరగతులు ప్రారంభిస్తూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపనీలు ఏకకాలంలో వేలాది మంది విద్యార్థులు భాగస్వామ్యం అయ్యే విధంగా బుధవారం రోజు ప్రభుత్వ ప్రవేట్ కాళాశాలల్లో గ్యాస్ వాడకం అవగాహన పై సదస్సులు నిర్వహించాయని ప్రత్యేకంగా ఐఓసియల్ తమ ఇండేన్ డీలర్ల ద్వారా లక్షన్నర మంది విద్యార్థిని విద్యార్థులను భాగస్వామ్యం చేశామని తెలిపారు. రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ తరగతుల్లో యల్పీజి ఉనికి, భౌతిక లక్షణాలు, సిలిండర్ తయారీ, బరువు, తయారీ తేది కాలపరిమితి, గ్యాస్ లీకేజ్, ప్రమాదాల నివారణకు 1906 టోల్ ఫ్రీ నంబర్, ఇండేన్ అందిస్తున్న పద్నాలుగు.2 పంతోమ్మిది,పది కిలోల ఫైబర్ సిలిండర్లు, ఐదు కిలోల రెడ్ బ్లూ సిలిండర్లపై చర్చించారు. భారత ప్రభుత్వం గత ఎప్రిల్ నుండి గ్యాస్ ఏజన్సీ డెలివరీ సిబ్బంది ద్వారా బేసిక్ సేప్టీ చెక్స్ (ప్రాథమిక భద్రతా తనిఖీ) కార్యక్రమం ఉచితంగా నిర్వహిస్తుందని ఎనమిది అంశాలతో కూడిన ప్రశావళి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుందని మదన్ మోహన్ కోరారు. ఇందులో భాగాంగా 190 రూపాయల విలువగల సురక్ష రబ్బరు ట్యూబు 140/ రూపాయలకు అందిస్తామని తెలిపారు. గతంలో ఇదే కార్యక్రమానకి 238 కస్టమర్ అందించాల్సిన స్థితిలో వుండే వారని, ఉచితంగా నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి ముప్పై మందికి తక్కువగా కాకుండా పునశ్చరణ లో గ్యాస్ వాడకంపై అందించిన సమాచారం యివ్వాలని కోరారు. విశ్రాంతి ప్రధానాచార్యలు సియచ్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ అంబుజా గ్యాస్ యాజమాన్యం తమ కస్టమర్లు వంటగ్యాస్ ప్రమాదాల బారిన పడకుండా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగస్వామ్యం కావడం ఆనందంగా వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన లావణ్య, రజిత, అతిథులు రంగారావు మేనేజర్ దేవేందర్ రెడ్డి, సిబ్బంది భరత్, సురేష్, ధామోధర్, అయ్యప్ప సాగర్, అన్వేష్, శరత్, భరత్ రెడ్డి, సరిత, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.