మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుజురాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో కరీంనగర్ జిల్లా పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతిని ఆదేశాల మేరకు పట్టణ సిఐ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యములో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ ఏఎస్ఐ కమల తెలిపారు.
ఎస్ఐ కమల వారి సిబ్బంది కలిసి కళాశాల, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లు, ఈ సిమ్ కార్డు మోసాలు, మోసపూరిత లింకులు, ఓటీపీలు వంటి నేరాల నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. మోసపూరిత కాల్స్ మెసేజ్ లు వచ్చినప్పుడు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తప్పనిసరిగా 1930 సైబర్ టోల్ ఫ్రీ నెంబర్, సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలు, జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నేరుగా తెలియపరచాలని ఎస్సై కమల గారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఝాన్సీ రాణి, కళాశాల అధ్యాపకులు డాక్టర్ రేణుక, డాక్టర్ స్వరూపారాణి, మంగమ్మ, పల్లవి, డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ ఓదెలు, శ్రీధర్ పోలీస్ రహీమ్, లక్ష్మణ్, ఎస్సై కమల వారి సిబ్బంది కలిసి కళాశాల, పాఠశాల విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.