Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో చదివే విద్యార్థులకు ఆ పాఠశాలలో పనిచేసే రాళ్ల బండి విజయ పదివేల రూపాయల విలువగల యూనిఫామ్ లను శనివారం ఉచితంగా అందజేసింది. తమ పాఠశాలలో చదివే పిల్లలు ఎలాంటి ఇబ్బందులకు ఉండకుండా, గౌరవంగా పాఠశాలకు రావడానికి యూనిఫాములను అందజేసినట్లు ఆమె తెలిపారు. సొంత డబ్బులతో పిల్లలకు యూనిఫామ్ లు అందించిన విజయ మేడంను పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రదీప్ కుమార్, సురేందర్, రోస్ లీనా, చందా సుకన్య, సరిత,
జమున, పిఈటి భాగ్యలక్ష్మి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






