Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి:
కేరళ వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించడం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించడం పట్ల ప్రియాంక గాంధీ కి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ గారికి మించి ప్రియాంక గాంధీ కి రికార్డు మెజారిటీ కట్టబెట్టారని, వయనాడ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డారనీ వయనాడ్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.






