
–బాధిత కుటుంబానికీ 1,44,000 వేల రూపాయల అందజేత
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: చిన్ననాటి నుండి తమ తో ఆడుతూ పాడుతూ చదువుకొని జీవితంలో స్థిరపడిన కొన్ని సంవత్సరాలకే తమ చిన్న నాటి మిత్రుడు తమ మధ్య లేరన్న వార్త ఆ మిత్రులను కలిచి వేసింది. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సావనపల్లి స్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో SSC – 2008 బ్యాచ్ లో చదువుకున్నారు. స్వామి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు కాగా, గత కొంతకాలంగా స్వామి కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడి మృతిచెందారు. స్వామి మరణ వార్త స్నేహితులను కలిచి వేయగా తమ చిన్ననాటి మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని భావించినా మిత్రులు ఆర్థిక సహాయం అందించి మొత్తంగా 1,44,000 రూపాయలు జమచేసి, ఇద్దరు పిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో 1,20,000 వేల రూపాయలు జమ చేశారు. మిగిలిన 20 వేల రూపాయలు మరియు నిత్యావసర వస్తువులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమ చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన మిత్రులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు తమ్మిడి అనిల్, మొదుంపల్లి శ్రావణ్, పారం విష్ణు, యాదగిరి, మారుతి, పర్శరాం తదితరులు పాల్గొన్నారు.







