
–వీణవంక, జమ్మికుంటల మీదుగా హుజురాబాద్ కు.. వెళ్ళనున్న హరీష్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి, ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు ఆదివారం హుజురాబాద్ లో పర్యటించానున్నారు. ఇక్కడికి వస్తున్న హరీష్ రావుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ దండు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. హరీష్ రావు ఆదివారం ఉదయం హైదరాబాదు నుండి వీణవంకకు చేరుకుంటారు. అక్కడ అల్పాహారం చేసిన అనంతరం.. సందర్శకులతో మాట్లాడి జమ్మికుంట మీదుగా హుజురాబాద్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హరీష్ రావు హుజురాబాద్ కు వస్తున్న నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి
మాజీ మంత్రి హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గం లో పర్యటించడం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తన దూకుడుతో.. అధికార పార్టీని గడగడలాడిస్తున్న కౌశిక్.. సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఆయన పర్యటిస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై.. ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో.. హరీష్ రావు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బి ఆర్ ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డిలతోపాటు.. టిఆర్ఎస్ అధినాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతినిత్యం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, అవినీతి జరుగుతోందని, పాలన గాడికి వదిలేసిందని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఫార్మసీకి భూముల కేటాయింపు వ్యవహారం, హైదరాబాదులో హైడ్రా వ్యవహారం తదితర అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాదులోనూ కౌశిక్ రెడ్డి తన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ భవన్లో జరిగిన పలు ప్రెస్మీట్లలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై ప్రశ్నించారు. కోర్టుకు కూడా వెళ్లారు. అలాగే మంత్రుల అవినీతిపై ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ కూడా కేటీఆర్ హరీష్ రావుల తర్వాత అదే పద్ధతిలో ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై మాటల, విమర్శల తూటాలు ఎక్కు పెడుతున్నారు. పార్టీ శ్రేణులను ఆకర్షిస్తున్నారు. అలాగే స్థానిక పార్టీ శ్రేణుల్లోనూ కౌశిక్ ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ.. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఏమైనా ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావడమే కాక.. ఆయన పర్యటన నేపథ్యంలో గులాబీ పార్టీలోనూ ఉత్సాహం జోష్ నెలకొన్నాయి.








