
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స్వర్గీయ గుర్రం వెంకటేశ్వర్లు సంవత్సరికం సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(అనసూయ) ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో గుర్రం వెంకటేశ్వర్ల కుమారుడు హరిబాబును కలిసి వెంకటేశ్వర్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. టిడిపిలో రాష్ట్ర నాయకుడిగా తమతో కలిసి వెంకటేశ్వర్లు పనిచేశాడని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు, యెముల పుష్పలత, నంబి రామచంద్రం, గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఆయన కుమారులు, పలువురు నాయకులు ఉన్నారు.






