
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి సింగపూర్ కు చెందిన జయన్న ఫౌండేషన్ సరిత జైపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. సుమారు 600 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి చుక్కల మందులు ఉచితంగా అందజేశారు. కంటిలో శుక్లాలు కలిగి ఉన్న చిన్నచిన్న కురుపులు గడ్డలు కలిగి ఉన్న వారికి, శస్త్ర చికిత్స అవసరమైన వారిని 150 మందిని ఎంపిక చేసి వారందరిని రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి హైదరాబాదులో కంటి ఆసుపత్రికి తరలించారు. గుడిపాటి సరిత వాహనాల ముందు కొబ్బరికాయ కొట్టి వాహన ర్యాలీని ప్రారంభించారు. వారందరికీ జైయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, అంతేగాక వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగిందని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకుడు గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి వివరించారు. త్వరలో హుజురాబాద్ మండలంలోని గ్రామ గ్రామాన ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కంటిచూపు ప్రసాదించే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జయపాల్ రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని చీకటి మయమైన బతుకులలో వెలుగులు నింపుకోవాలని జయపాల్ రెడ్డి సూచించారు.
–










