
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు స్కూల్ అసిస్టెంట్ కూర్మాచలం వెంకటేశ్వర్లు సహకారంతో శుక్రవారం పాఠశాలలో చదువుతున్న డ్రాయింగ్ మరియు పెయింటింగ్ నందు ఆసక్తి, ప్రతిభ కలిగిన 20 మంది విద్యార్ధినీ విద్యార్థులకు పలు వస్తువులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు, హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్ విద్యార్థులకు డ్రాయింగ్ టేబుల్ ప్యాడ్, డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్ అందజేసారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఎంఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్కాకుల రాంప్రసాద్, మచ్చ పవన్ కుమార్, పొద్దుటూరి కిషన్ రెడ్డి, గోదా పుష్ప లత, కాసర్ల అనిల్, నేరెళ్ల ప్రశాంత్, బడబాగ్ని ఉమాదేవి పాల్గొన్నారు.






