
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలనీ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు బిజెపి ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం హుజురాబాద్ బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేయడం జరిగిందని సంపత్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడం కోసం డిసెంబర్ 2,3 తేదీలలో హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ రోజున హుజురాబాద్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ప్రజలకు తెలియజేయనునట్టు సంపత్ రావు తెలిపారు. బైక్ ర్యాలీ బహిరంగ సభలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం కోసం బిజెపి కార్యకర్తలు పనిచేయాలని సంపత్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబెర్ పుప్పాల రఘు, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి, మండల అధ్యక్షులు గంగిశెట్టి రాజు, ఆదిరెడ్డి, జీడీ మల్లేష్, తిరుపతిరెడ్డి, జిల్లా మోర్చా జనరల్ సెక్రటరీ ఆకుల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మల శోభన్ ప్రజా ప్రతినిధులు, జిల్లా పదాధికారులు, పార్టీ ముఖ్య భాద్యతలున్న నాయకులు పాల్గొన్నారు.







