
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ డిసెంబర్ 01: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విఆర్ఎస్ డిఎస్పి మదనం గంగాధర్ ను బలపరచాలని బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన హుజురాబాదులో ప్రచారం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..పేపర్ బాయ్ గా, సంచార జీవితం గడుపుతూ చదువుకున్న మధనం గంగాధర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్సైగా ఉద్యోగంలో చేరి సీఐగా డీఎస్పీగా పలు పదోన్నతులు పొందిన గంగాధర్ తన సర్వీస్ లో అధికారులతో ప్రజలతో మంచి పేరు తెచ్చుకొన్నాడన్నారు. తన సర్వీస్ లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించి, త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడడం కొరకు తన సర్వీస్12 సంవత్సరాలు ఉన్న తన పదవికి రాజీనామా చేసి పట్టభద్రులకు ప్రజలకు నిరుద్యోగులకు సేవ చేయాలని సంకల్పంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నానని మధనం గంగాధర్ VIS) డీఎస్పీ అన్నారు. మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా హుజురాబాద్ వాకర్స్, మరియు జమ్మికుంట వాకర్సుతో ముఖాముఖి చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించగలరని, రెండు పట్టణాలకు సంబంధించిన వాకర్స్ ని గంగాధర్ కోరారు. జమ్మికుంట, హుజురాబాద్ రెండు పట్టణాలకు చెందిన వాకర్స్, పట్టభద్రులు సానుకూలంగా స్పందించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం, వేయించడం మీ గెలుపులో మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ కు పట్టభద్రుల అందరికీ గంగాధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన కమ్యూనిటీకి చెందిన బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో గంగాధర్ కు పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తుర్పాటి లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిగిరి సంపత్ కుమార్, వానరాశి జాన్, రేవల్లి వెంకటేష్, చింతల అంజి, తూర్పాటి రాజు, తూర్పాటి చిన్న భూతం అంజి, మోటం రామ్ కుమార్, తూర్పాటి రాజు, జమ్మికుంట, హుజురాబాద్ వాకర్స్ నాయకులు తదితరులు పాల్గొనగా వారికి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.










