
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సారెస్పీ ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ… ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ (ప్రాజెక్టులు) హైదరాబాద్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నేత టేకుల శ్రావణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున సైదాపూర్ రోడ్డులో గల ఎస్సారెస్పీ ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని ఎస్సారెస్పీ డివిజన్ (1) పరిధిలో గల ప్రభుత్వ భూమి ఎడమ, కుడి కాలువకు ఇరువైపులా భూములు కబ్జా చేసి యదేచ్చగా మున్సిపల్ కార్యాలయం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఇదంతా జరుగుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని అన్నారు ఇట్టి విషయమై హుజురాబాద్ ఆర్ డిఓ కి మరియు ఫిర్యాదు చేసినట్టు అడిషనల్ కలెక్టర్ దృష్టి కి తీసుకువెళ్ళినట్టు తెలిపారు ఎస్సారెస్పీ ఎడమ, కుడి వైపుల కొన్ని ఎకరాలు అక్రమించుకున్నారని అట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకొని అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. ఇట్టి విషయమై హుజురాబాద్ ఆర్ డిఓకి మరియు అడిషనల్ కలెక్టర్ కి సైతం ఫిర్యాదు చేసి వారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. కచ్చితంగా ఇట్టి విషయమై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తానని శ్రవణ్ హెచ్చరించారు.

ఆర్డీవో కు ఫిర్యాదు చేస్తున్న శ్రవణ్






