
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్.
ప్రభుత్వము ఆధ్వర్యంలో నడిచే హాస్టల్లల్లోని పిల్లలకు భోజన వసతి సక్రమంగా ఉండి సౌకర్యాలు కల్పించాలని బిఆర్ఎస్ వి విభాగం పట్టణ అధ్యక్షుడు విడపు అనురాగ్ అన్నారు. బి ఆర్ఎస్ వి హాస్టల్ బాట పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసీ క్యాంపులో గల గురుకుల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉన్న మౌలిక సౌకర్యాలను వారు పరిశీలించారు. పిల్లలకు భోజనాలను అందిస్తున్న విధానాన్ని చూసి, అక్కడి పరిస్థితులను గమనించారు. ఆహారం బాగున్నప్పటికీ పరిసర ప్రాంతాలన్నీ లోప భూయిష్టంగా ఉన్నట్లు వారు గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భోజన విషయంలోగాని ఇతర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమకు ఫోన్ చేయాలని టిఆర్ఎస్వి హెల్ప్ లైన్ గోడ కట్టించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తక్షణమే తమను సంప్రదించ వచ్చునని సూచించారు. ఆయన వెంట వడ్లకొండ కిరణ్, పలువురు బిఆర్ ఎస్వి నాయకులు పాల్గొన్నారు.









