Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 08:బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం నవంబర్ 30 నుండి డిసెంబర్ 8 వరకు నిర్వహించామని ఈ కార్యక్రమం నేటితో గురుకుల బాట ముగిసిందని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, గురుకుల బాట జిల్లా ఇన్చార్జి ఆవాల హరిబాబు అన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలోనీ ఉన్న అన్ని గురుకులాలను, సంక్షేమ హాస్టల్ లను, కస్తూర్బా హాస్టల్ ను జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల స్థానిక బిఆర్ఎస్వి నాయకులు గురుకుల బాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా గురుకులాల లో ఉన్న అనేక సమస్యలను బిఆర్ఎస్వి నాయకులు గుర్తించడం జరిగిందనీ ఆ వివరాలను నివేదిక రూపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వేసిన కమిటీకి అందజేస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొదలై ఆరు నెలలు గడుస్తున్న నేటికీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, బెడ్ షీట్స్, డ్రెస్సులు, కనీస వసతులు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడం బాధాకరంమని, గురుకుల విద్యార్థులకు చలికాలంలో కూడా దుప్పట్లు ఇవ్వకుండా పేద విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు సన్న బియ్యంనీ పంపిణీ చేస్తే నేడు కొన్నిచోట్ల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుందని, ఈ విషయాన్ని గుర్తించామని, కొన్ని చోట్ల మెనూ సరిగా అమలు చేయడం లేదని వారికి ఇచ్చే పౌష్టికాహారంలో సరిగా అందివ్వడం లేదని విద్యార్థులు మా దృష్టి తీసుకువచ్చారనీ భోజనం సరిగా లేదని విషయాన్ని, నేటికీ కాస్మోటిక్స్ అందలేదు. అనేకమైన అంశాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చారని, గురుకులాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇంకుడు గుంతల ద్వారా స్టోర్ అయిన వాటర్ ద్వారా పాఠశాల ప్రాంగణంలో దుర్వాసనతో అనేక గురుకులాలు నడుస్తున్నా యి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిం చారు. అనేకచోట్ల అద్దె భవనాలలో కొనసాగుతు న్న పాఠశాలలకు సరైన సమయం లో కిరాయిలు ఇవ్వకపోవడం వల్ల యజమానులు స్కూళ్లకు తాళాలు వేస్తున్నారని అన్నారు. మోడల్ స్కూల్లో వంట గదులు పర్మినెంట్ బిల్డింగ్ లేక బయటనే చేస్తున్నారని, అదేవిధంగా వాటికి ఉపయోగించే మిషన్ భగీరథ తో వచ్చి న వాటర్ ను ఉపయోగించడం ద్వారా విద్యార్థు బిలకు పెట్టే భోజనంలో రంగు మారుతుందని గుర్తించామనిఅలాంటి సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ.జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ లో నాణ్యమైన భోజనాన్ని అన్ని రకాల కాస్మోటిక్స్ ను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ వారికి అన్ని రకాల సదుపాయాలు అందించే వరకు బిఆర్ ఎస్ పార్టీ విద్యార్థి విభాగం సంక్షేమ హాస్టల్లో వెంట వారి సమస్యల పరిష్కారం కోసం నిరంత రం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా బిఆర్ ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, గురుకుల బాట జిల్లా ఇన్చార్జి ఆవాల హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ వర్మ, అనిల్, భరత్, అరవింద్, శ్రీకాంత్, కౌశిక్, హరీష్, సాగర్, భూపతి, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.






