
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, వరంగల్:ఎరుకల సమస్యలను అసెంబ్లీ – శాసనమండలిలో ప్రస్తావించాలని -తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది మంత్రులు మారిన తెలంగాణ ఆదివాసి ఎరుకల సమస్యలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఎరుకల జాతిని గుర్తించి ఎరుకల సమస్యలపై 9వ తేదీ నాడు జరిగే అసెంబ్లీ శాసనమండలి సభలో ఎరుకల సమస్యల పరిష్కారం పైన ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికిన
ప్రస్తుతము ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి మాకు న్యాయం చేయాలని విద్యార్థి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేవెళ్ల ఎస్.టి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్రంలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న ఆదివాసి ఎరుకల యువతీ యువకులకు ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలో గాని ప్రైవేట్ రంగ సంస్థలో గాని ఔట్సోర్సు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పందుల పెంపకపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వము ఎరుకల ఎంపవర్మెంట్ స్కీముని ప్రవేశపెట్టి 60 కోట్లు బడ్జెట్ ఇచ్చిన జీవోను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వము హైదరాబాద్ కేంద్రంగా నిజాంపేట్ లో ఎకరం భూమిలో మూడున్నర కోట్లతో ఎరుకల ఆత్మగౌరవ భవనం పూర్తిగా నిర్మాణం కాలేదు కావున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము అదనంగా బడ్జెట్ కేటాయించి ఎరుకల ఆత్మగౌర భవనం పూర్తిచేసి ఎరకల జాతికి అంకితం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎరుకల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు ములుగు జిల్లా రామంజపురం గ్రామంలో కాకతీయ రాజులు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరుకల నాంచారమ్మ పంచకూటాలయాన్ని
పుణ:నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిన్న సారయ్య, హసన్పర్తి మండల అధ్యక్షులు మాన్పాటి సురేందర్, ప్రధాన కార్యదర్శి మాన్పాటి విజేందర్, మేనరగుత్తి రఘు, దేవర ఎల్లయ్య, మానుపాటి గణేష్, మానుపాటి సాంబమూర్తి, అంబి రాజేష్, దేవర మొగిలి, దేవర శ్రీకాంత్, కెoసారం శేఖర్, మానుపాటి ప్రసాద్, పల్లకొండ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.







