
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మాథ్స్ టాలెంట్ కార్యక్రమంలో పాల్గొని పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా శ్రీ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా గొప్పవని వారు అందించిన సేవలు చారిత్రాత్మకమైనవి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ వారి రూపొందించిన అంశాలను ప్రాచుర్యంలో తీసుకురావడమే కాకుండా వారు ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడమే ప్రణాళికగా ముందుకు సాగాలని సూచిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.








