
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ గ్రంథాలయంలో అదనపు గది రేకులషెడ్డు నిర్మాణానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 1లక్ష విరాళం అందజేసి నిర్మాణం పూర్తి కావడంతో నేడు ప్రారంభించారు.. గురువారం హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించి.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ మార్నింగ్ వాక్ ప్రచారానికి వచ్చినప్పుడు గ్రంథాలయ నిర్మాణానికి రేకుల షెడ్డు విషయం తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి లక్ష రూపాయలతో నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.. గ్రంథాలయాల బలోపేతానికి వంతు కృషి చేస్తానని వెల్లడించారు… గతంలో గెలిసిన ఎమ్మెల్సీలు పట్టభద్రుల సమస్యలను పట్టించుకోలేదని.. ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్ర సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళల కృషి చేస్తానని.. ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.. ఎమ్మెల్సీ పరిధిలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి రావడంతో.. చాలా చోట్ల తన సొంత నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు వెల్లడించారు. నిజామాబాద్ గ్రంథాలయంలో తన సొంత నిధులతో మధ్యాహ్న భోజనం, గ్రంథాలయంలో చేర్ పాడ్స్, షింటేక్ వాటర్ ట్యాంకు ను అందజేసినట్లు వెల్లడించారు… నిరుద్యోగ నిర్మూలకు తన కృషి చేస్తానని.. ప్రజాసేవ చేసేందుకే తను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ పట్టభద్రులకు విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను ఆయన అందజేశారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనక లక్ష్మి తిప్పారపు సంపత్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గవ్వ వంశీధర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ పలువురు నాయకులు పాల్గొన్నారు.









