Oplus_131072
కుమార్ యాదవ్, రిపోర్టర్ జమ్మికుంట: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బండారి చేరాలు (55) అనే రైతు కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండారి చేరాలు పొలం పనులు ముగించుకొని తన బైక్ పై ఇంటికి వెళుతుండగా అతివేగంగా అజాగ్రత్తగా టీఎస్ 02 ఈఎఫ్ 7323 నంబరు గల కారు జమ్మికుంట నుండి కరీంనగర్ వెళ్తుండగా బైక్ పైనా వెళ్తున్న బండారి చేరాలును ఢీ కొట్టగా తీవ్ర రక్త గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఢీ కొట్టిన వాహనం యజమాని పేరు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






