
–ప్రజాసేవలో నిమగ్నమయ్యేందుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా తన నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేందర్ రావుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజేందర్ రావు ముఖ్యమంత్రికి పూల కుండిని అందజేశారు. రాజేందర్ రావు నిత్యం ప్రజా సేవలో నిమగ్న మవుతూ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాజేందర్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, ప్రజలకు మరింత అత్యుత్తమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి రాజేందర్ రావు ముఖ్యమంత్రితో మాట్లాడారు. కరీంనగర్ పర్యటనకు రావాలని మరోసారి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో కరీంనగర్ కు వస్తానని పేర్కొన్నారని రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు.






